ఇకపై వాట్సాప్ మెసేజెస్ ఎడిట్ చేసుకోవచ్చు..
Whats App : తమ యూజర్లకు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను అందించడంలో ముందుండే వాట్సాప్ (Whats App) ..ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ తో రాబోతోంది. వాట్సాప్ వినియోగదారులు తాము పంపిన మెసేజెస్ ను ఎడిట్ ( edit messages) చేసుకునే కొత్త ఫీచర్ ను అతి త్వరలో అందించబోతోంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెల్లారి లేస్తే చాలు వాట్సాప్ (Whats App) తోనే కాలం గడిపేస్తున్నారు. కొంతమంది అవసరం కోసం, మరికొందరు టైమ్ పాస్ కోసం వాట్సాప్ వాడుతూనే ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి ఒకరికి బదులు ఇంకొకరికి అనుకోకుండా కొన్ని మెసేజులు పంపించినా. మిస్టేక్స్ ఉన్న మెసేజెస్ పంపినా.. దానికి ఇప్పటి వరకూ డిలీట్ ఫర్ ఆల్ ఆప్షన్ ను ఎంచుకుంటూ ఉంటున్నాం. అయితే అది కూడా వాట్సాప్ ఈ మధ్యనే ఇంట్రడ్యూస్ చేసింది.
కొన్నిసార్లు మెసేజ్ సెండ్ అయ్యాక అయ్యో.. తప్పుగా వెళ్లిందే అనుకుంటాం… కొన్నిసార్లు డిలీట్ ఫర్ ఆల్ (Delete for all option) కొట్టి.. మళ్లీ రీ రైట్ చేసి పంపిస్తాం. అయితే ఇకపై ఆ మెసేజునే తిరిగి సరిదిద్ది పంపొచ్చు. అయితే ఈ ఎడిట్ మెసేజ్ ఆప్షన్ ను ప్రస్తుతానికి వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. కాకపోతే ఈ ఆప్షన్ సందేశం పంపిన 15 నిమిషాల లోపే పనిచేస్తుంది. ఆ తర్వాత మనం ఎడిట్ చేయలేం. అప్పుడు డిలీట్ ఫర్ ఆప్షన్ (Delete for all option)నే ఎంచుకోవాలి.
ఆండ్రాయిడ్ యాప్ తో పాటు, ఐవోఎస్ , వెబ్ యూజర్లకు కూడా అతి త్వరలోనే ఈ సదుపాయం అందించడానికి వాట్సాప్ యాప్ రెడీ అవుతోంది. అయితే ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేది అన్నది క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు అంతర్జాతీయ ఫ్రాడ్ కాల్స్ (International fraud calls)బెడదతో పాటు.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ బెడద ఈ మధ్య ఎక్కువ అవుతుంది. దీనికోసం కూడా అంటే ఇటు వంటి కాల్స్ కు రింగ్ రాకుండా చేసే ఆప్షన్ ఇప్పుడు బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఒకవిధంగా ఇది చాలామందికి గుడ్ న్యూసే అవుతుంది. ఈ రెండు ఫీచర్లను అతి త్వరలోనే అందరికీ తీసుకువచ్చే పనిలో వాట్సాప్ ఉంది.
వాట్సాప్ ఎడిట్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది…
వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లో మనం పంపిన మెసేజ్ పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేస్తూ ప్రెస్ చేయాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్ తో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మనం ఎడిట్ ఆప్షన్ ను ఎంచుకుని.. చేయాలనుకున్న కరెక్షన్ చేయొచ్చు. ఇలా ఎన్నిసార్లయినా చేయొచ్చు కాకపోతే కండిషన్స్ అప్లై అన్నట్లు 15నిమిషాలలోపే ఎన్నిసార్లు చేసినా అది తీసుకుంటుంది. ఒకసారి ఎడిట్ చేశాక ఎడిటెడ్ అన్న మెసేజ్ అవతలి వ్యక్తికి మెసేజ్ లో కనిపిస్తుంది.