Anand Mahindra on Chess Kid: ఇలాంటి వారే భారత్ భవిష్యత్‌ను మార్చగలరు
Anand Mahindra on Chess Kid: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా రోజువారి జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటారు. దేశంలో జరుగుతున్న విషయాలపై ఆయన తప్పనిసరిగా స్పందిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దేశ భవిష్యత్తును మార్చగలిగే సత్తా ఇలాంటి చిన్నారులకే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడులోని హోసూరులో జరిగిన చెస్ పోటీల్లో 1600 మంది స్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు. ఇందులో ఓ విద్యార్ధి రాత్రి మొత్తం రెండు బస్సుల్లో ప్రయాణించి మరుసటి రోజు నేరుగా పోటీ జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు.
మరికాసేపట్లో పోటీ జరగబోతుందనగా చిన్న కునుకు తీశాడు. దీనిని సంబంధించిన ఫొటోను ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జరగబోయే పోటీలో విజయం సాధించడమే అతని లక్ష్యమని, అందుకోసమే రెండు బస్సుల్లో ప్రయాణం చేసి, బస్టాండ్ నుండి ప్రాంగణానికి చేరుకొని అలసిపోయిన ఆ బాలుడు కాసేపు కునుకు తీశాడని, అంకితభావంతో పనిచేసే వ్యక్తులకే దేశాన్ని మార్చగలిగే శక్తి ఉంటుందని ట్వీట్ చేశాడు. కాగా, ఈ ట్వీట్ కు మండే మోటివేషన్ పేరుతో ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం దీనిపై అనేకమంది స్పందించి కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారికి ఆల్‌దిబెస్ట్ చెబుతున్నారు.