Anand Mahindra Cars in Garage: గ్యారేజీలో కొలువుదీరిన మహేంద్రుడి కార్లు
Anand Mahindra Cars in Garage: ఆనంద్ మహీంద్రా అంటే గుర్తుకు వచ్చేది రాజసం కలిగిన కార్లు. సామాన్యులకు అందుబాటులో ఉండే కార్ల దగ్గరి నుండి, కమర్షియల్, ప్రీమియం కార్లను తయారు చేయడంలో మహీంద్రా కంపెనీ ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది. పూర్వం రోజుల్లో మహీంద్రా జీప్‌లు ఎంత పాపులర్ అయ్యాయో చెప్పాల్సని అవసరం లేదు. ఆ తరువాత స్కార్పియో వాహనం ఏ వెలుగు వెలిగింది. మారుతున్న కాలాన్ని అనుసరించి మహీంద్రా కంపెనీ కార్లను తయారు చేస్తూ పోటీ ప్రపంచంలో నెగ్గుకొస్తున్నది. అయితే, ఆనంద్ మహీంద్రా సైతం తన సంస్థలో తయారవుతున్న కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారట.
తన కంపెనీలో తయారయ్యే కార్లలో ఆయన కొన్నింటిని కొనుగులో చేస్తుంటాడు. అందులో ముఖ్యమైనవి మహీంద్రా బొలెరో ఇన్వాడెర్, మహీంద్రా టీయు 300, మహీంద్రా టీయు 300 ప్లస్, స్కార్పియో, మహీంద్రా అల్టురాస్ జీ4, స్కార్పియో ఎన్ కార్లను మహీంద్రా గ్యారెజ్‌లో ఉన్నాయి. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా అందులో నచ్చినవి స్వయంగా కొనుగోలు చేస్తాడట. మహీంద్రా టీయూ 300 ప్లస్ మోడల్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ సమయం పాటు వేచి ఉన్నట్లు మహీంద్రా ఓ సందర్భంలో పేర్కొన్నారు. తన గ్యారేజీలో ఉన్న కార్లలో అన్నింటికంటే స్కార్పియో అంటేనే ఆనంద్ మహీంద్రకు ఇష్టం. ఆ వాహనాన్నే ఆయన ఎక్కువకాలం పాటు వినియోగించారు.