Ant Group: జాక్ మా కీలక నిర్ణయం, యాంట్ గ్రూప్‌పై ఆధిపత్యానికి గుడ్ బై
Alibaba founder Jack Ma to leave the control of Ant Group
చైనీస్ బిలియనీర్, అలీబాబా సంస్థ ఫౌండర్ జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నాడు. యాంట్ గ్రూప్‌పై ఆధిపత్యాన్ని వదులకున్నట్లు ప్రకటించాడు. అలీబాబా సంస్థకు అత్యంత కీలకమైన యాంట్ గ్రూప్‌పై ఆధిపత్యం వదులుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యాంట్ గ్రూప్‌లో పనిచేస్తున్న 10 మందికి ఓటింగ్ హక్కులను కల్పించారు. ఫౌండర్‌తో పాటు మేనేజ్‌మెంట్ సభ్యులకు కూడా ఓటింగ్ రైట్స్ కల్పించారు.
2020లో ఒక వివాదాస్పద ప్రసంగం చేసిన జాక్ మా, అనంతరం చాలా కాలం పాటు జనాలకు కనిపించకుండా పోయాడు. రెగ్యులేటర్లను విమర్శించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. దీంతో యాంట్ గ్రూప్ రెగ్యులేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
37 బిలియన్ డాలర్ల అదిపెద్ద పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి కొద్ది రోజుల ముందు, ప్రభుత్వ బ్యాంకులపై, ఆర్ధిక నియంత్రణ సంస్థలపై జాక్ మా విమర్శలు చేశారు. దీంతో చైనా అధికారులు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా అడ్డు పడింది.
ప్రస్తుతం సంస్థలో 10 మందికి ఓటింగ్ హక్కులను కల్పించడంతో పరిస్థితులు మారనున్నాయి. గత ఏడాది జూలై నెలలోనే జాక్ మా ఉద్దేశ్యాన్ని సంస్థ ప్రకటించింది. యాంట్ గ్రూప్‌పై జాక్ మా కంట్రోల్ క్రమక్రమంగా తగ్గనుందని కూడా అప్పట్లో తెలిపింది. చెప్పినట్లుగానే ప్రస్తుతం జరుగుతోంది.