Akasa Air Services: హైదరాబాద్ నుండి మొదలైన ఆకాశ ఎయిర్ సర్వీసులు
Akasa Air Services from Hyderabad: ఇటీవలే దేశంలో కొత్త ఎయిర్ సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దివంగత రాకేశ్ ఝంఝంవాలా కలల ప్రాజెక్టు ఆకాశ ఎయిర్ సర్వీసులు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదట ఢిల్లీ నుండి ముంబైకి సర్వీసులను నడిపారు. కాగా, ఇప్పుడు ఈ ఆకాశ ఎయిర్ సర్వీసులు హైదరాబాద్ కేంద్రంగా కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుండి మొదట గోవా, బెంగళూరుకు సర్వీసులను నడుపుతున్నారు. ఈరోజు నుండి ఈ సేవలు ప్రారంభం అవుతున్నాయి.
ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు క్యూపీ 1415 విమానం హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1:45 గంటలకు గోవా చేరుకుంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:20 గంటలకు తిరిగి గోవా నుండి బయలుదేరి మధ్యాహ్నం 3:35 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని ఆకాశ ఎయిర్‌లైన్స్ అధికారులు పేర్కొన్నారు.
అదేవిధంగా మధ్యాహ్నం 4:15 గంటలకు క్యూపీ 1418 విమానం హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 5:25 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఈ రెండు సర్వీసులు హైదరాబాద్ నుండి నడవనున్నాయి. ఈ సర్వీసులు విజయవంతమైతే మిగతా ప్రాంతాలకు కూడా క్రమంగా విస్తరించే అవకాశం ఉందని ఆకాశ ఎయిర్ లైన్స్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ సర్వీసుగా ప్రారంభించిన ఆకాశ ఎయిర్ లైన్స్‌ను రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సర్వీసులుగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.