Air India Republic Day Bumper Offer: 1705 రూపాయలకే విమాన టిక్కెట్…
Air India Republic Day Bumper Offer: రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని ఎయిర్ ఇండియా సంస్థ ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశీయంగా ప్రయాణాలు చేసేవారిని ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఫ్లైఏఐ సేల్ పేరుతో సరికొత్త డిస్కౌంట్‌ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ సేల్ ఆఫర్ జనవరి 21 నుండి 23 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశీయంగా ఎయిర్ ఇండియాలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సేల్ డిస్కౌంట్ ద్వారా రూ. 1705 కే విమాన టిక్కెట్లను అందిస్తున్నది. ఇలా బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలు చేయవచ్చు.
అయితే, ఈ ఆఫర్ అన్ని రూట్లకు ఇవ్వడం లేదని, ఎంపిక చేసిన 49 రూట్లలో మాత్రమే ఈ ఫ్లైఏఐ సేల్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆ సంస్థ తెలియజేసింది. ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు, వివిధ రూట్లలో ప్రాయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ఎయిర్ ఇండియా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కరోనా తరువాత దేశీయంగా విమాన సేవలు, ప్రయాణాలు పెరిగాయి. చీప్ ధరలకే టిక్కెట్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు విమాన ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.