Aadhar Pan Link: లింక్ చేయకుంటే తిప్పలే…
Aadhar Pan Link: ఆధార్ కార్డును తప్పని సరిగా పాన్ కార్డ్‌తో లింక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు లింక్ చేసుకోని పక్షంలో వెంటనే చేసుకోవాలని లేని పక్షంలో పాన్ కార్డ్ చెల్లుబాటు కాదని, ఆదాయపన్ను రిటర్న్ కూడా కాదని అధికారులు చెబుతున్నారు. లింక్ చేసుకోవాలని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఎన్నోమార్లు పేర్కొన్నా చాలా మంది లింక్ చేసుకోలేదు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం కిందకు రాని పార్ కార్డ్ హోల్డర్లు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు లోపు తప్పని సరిగా లింక్ చేసుకోవాలి.
పాన్ కార్డులను లింక్ చేయకుంటే, వచ్చే ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కార్డులు చెల్లుబాటు కావని అధికారులు స్పష్టం చేశారు. డెడ్ లైన్‌ను మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ లింక్ తప్పని చేసుకోవాల్సిందేనని కేంద్రప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవడానికి సాధారణ గడువు ముగిసిందని, ఇప్పుడు లింక్ చేసుకోవడానికి రుసుము కింద రూ. 1000 చెల్లించి పాన్ తో ఆధార్‌ను లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ వెల్లడించింది.