META: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ మెటాకు (Meta) గట్టి షాక్ ఇచ్చింది యూరోపియన్ డేటా ప్రొటక్షన్ బోర్డు. యూజర్ల డేటాను అక్రమంగా తరలించినందుకు గానూ వేల కోట్ల జరిమానా విధించింది.
META: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ మెటాకు (Meta) గట్టి షాక్ ఇచ్చింది యూరోపియన్ డేటా ప్రొటక్షన్ బోర్డు. యూజర్ల డేటాను అక్రమంగా తరలించినందుకు గానూ వేల కోట్ల జరిమానా విధించింది. మొత్తం 1.3 బిలియన్ డాలర్లను చెల్లించాలని డీపీసీ ఆదేశించింది.
యూరోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్బుక్ డేటాను.. అక్రమంగా అమెరికాలోని సర్వర్లకు బదిలీ చేశారని మెటాపై ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ విచారణ చేపట్టి మెటాపై చర్యలు తీసుకుంది. 201 మే 25న అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ని మెటా ఉల్లంఘించిందని డీపీసీ వెల్లడించింది. యూజర్ల డేటా భద్రత విషయంలో ప్రాథమిక హక్కులను హరించేలా మెటా వ్యవహరించిందని ఆరోపించింది. యూజర్ల డేటాకు ఉన్న ముప్పును తొలగించడంలో మెటా విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు 1.3 బిలియన్ డాలర్లు లేదా 130 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అంటే భారత కరెన్సీలో రూ. 10 వేల కోట్లు.
అయితే యూరోపియన్ డేటా ప్రొటక్షన్ బోర్డ్ నిర్ణయాన్ని మెటా తీవ్రంగా ఖండించింది. ఇది అన్యాయమైన జరిమానా అని పేర్కొంది. డీసీపీపై కోర్టులో అప్పీలు చేస్తామని వెల్లడించింది.