Yuvagalam: యువగళం @ ఒక నెల.. కానీ అదే మిస్ అవుతోందే!
Yuvagalam: తెలుగుదేశం పార్టీకి లోకేషే వారసుడు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈరోజు ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు తన వయోభారాన్ని సైతం పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నా అది లోకేష్ కోసమే. తండ్రి అపర చాణక్యుడయినా ముందు నుంచి లోకేష్ కాస్త మెతక అనే ముద్ర పడింది. దానికి తోడు కాస్త లావుగా ఉండడం తెలుగు మీద పట్టు లేకపోవడంతో ఆయనను పప్పు అనే ముద్ర వేశారు ప్రత్యర్థులు. ఈ క్రమంలో ఎన్నాళ్ళుగానో టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నట్టు ఎట్టకేలకు యువగళం పేరుతో జనంలోకి వచ్చారు. నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల దూరం అంటూ ఆయన సొంత టార్గెట్ పెట్టుకుని కుప్పం టూ ఇచ్చాపురం రూట్ వేసుకుని గత నెల 27న అంటే సరిగ్గా నెల రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభించారు.
ఇప్పటికి ఆయన మూడు వందల కిలోమీటర్ల పై దాకా నడిచారు, ఇంకా మూడువేల ఏడు వందల కిలోమీటర్ల లక్ష్యం ఉంది. అయితే పాదయాత్ర మీద రిపోర్టులు చూస్తే యావరేజ్ అనే అంటున్నారు. లోకేష్ కి ఇది మంచి అవకాశం అయినప్పటికీ ఆయన సరైన తీరులో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని విశ్లేషకులు వస్తున్నాయి. ఎందుకంటే పాదయాత్ర ఏదైనా ఒక ఆకర్షణ ఉండాలి, ముఖ్యంగా ఒక అజెండా ఉండాలి. కానీ లోకేష్ మాత్రం యువతను టార్గెట్ చేయాలని మొదలెట్టిన నడక వారినే ఆకట్టుకోవడం లేదని అంటున్నారు. అరిగిపోయిన స్పీచ్ తో లోకేష్ జనాలను ఒక దశలో బోర్ కొట్టిస్తున్నారు అని అందుకే లోకేష్ పాదయాత్ర కోసం పార్టీ కష్టపడుతూ జనసమీకరణ చేస్తోందని అంటున్నారు. అయితే లోకేష్ సలు కంటెంట్ ని పక్కన పెట్టేసి కేవలం జగన్ మీద విమర్శలు చేయడం మీద దృష్ఠి పెడుతున్నారు అని అంటున్నారు. జనవరి 27న కుప్పంలో జరిగిన సభలో జగన్ని ఎలా విమర్సించారో ఇపుడు అదే తీరున ఆయన విమర్శలు సాగుతున్నా కొత్తదనం లేకుండా పోయింది.
ప్రతీ దానికీ జగన్ తో ముడిపెడుతూ జగన్ ని ముగ్గులోకి లాగుతూ సవాల్ చేస్తున్నారు. మేమొస్తే ఏం చేస్తామనే దాన్ని హైలైట్ చేయకుండా జగన్ నామస్మరణ చేస్తూ నెల రోజులు గడచిపోయాయని అంటున్నారు. మరి మిగిలిన కాలమైనా లోకేష్ పాదయాత్రలో మార్పులు చేసుకుని తన స్పీచ్ ని మార్చుకుంటారా అనేది చూడాలి. లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని యువతను మచ్చిక చేసుకోవాలి, నేటి ఏపీలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని ప్రస్తావించాలి, ప్రభుత్వం మీద నేరుగా కామెంట్స్ చేయకుండా యువతకు తాము ఏమి చేయబోయేది చెబితే వారు అట్రాక్ట్ అవుతారు కానీ అన్నిటికీ జగన్ కారుకుడు అంటూ విమర్శలు చేయడం వల్ల యువగళంలో అసలు యువ ఎలిమెంట్ మిస్ అయిందని అంటున్నారు. మరి ఇప్పటికైనా లోకేష్ ఈ విషయాన్ని అర్ధం చేసుకుని ముందుకు వెళితే అటు ఆయనకు ఇటు టీడీపీకి ఉపయోగం ఉంటుందని లేదంటే ఇబ్బందు అని అంటున్నారు విశ్లేషకులు.