YSRCP Counters: ఇది అపవిత్ర కలయిక..డుడు బసవన్నలా తల ఊపడానికే!
YSRCP Strong Counters on CBN- Pawan Meeting: ముందు నుంచి అనుకుంటున్నట్టుగా చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లిన అంశం హాట్ టాపిక్ అయింది. వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా వారి మీద విరుచుకుపడుతున్నారు. ఈ అంశం మీద మంత్రి గుడివాడ అమర్నాధ్ ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్లారని ఆయన ట్వీట్ చేశారు. ఇక మంత్రి అంబటి సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు డుడు బసవన్నలా తల ఊపడానికి ! అంటూ ట్వీట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్ పెట్టి 2014లో బీజేపీ,టీడీపీ,జనసేన కలిసి రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేశారని, చంద్రబాబు చెప్పినట్లు ఆడతాడు కాబట్టే పవన్ ను మేం దత్తపుత్రుడు అంటామని అన్నారు. దత్తపుత్రుడు అంటే చెప్పుతీసుకుని కొడతానని పవన్ అంటున్నాడు, అయితే చెప్పుతీసుకుని ఎవరిని కొట్టాలో పవన్ ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు. ఇక ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలగిపోయిందని పేర్కొన్న ఆయన ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్ 1 పై చర్చించడమేంటి ? అని ప్రశ్నించారు.
జీవో నెంబర్ 1 పై చర్చించడానికి హైదరాబాద్ లో సమావేశమయ్యామనడం హాస్యాస్పదం అని పేర్కొన్న ఆయన పవన్ కు ఒక స్టాండ్ లేదని, ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి వెళ్లాడని అన్నారు. ఇది అపవిత్ర కలయిక అని పేర్కొన్న ఆయన మనసుని చెపుకుని పవన్ చంద్రబాబు దగ్గరకు వెళ్లాడని అన్నారు. కచ్చితంగా ప్యాకేజీని కుదుర్చుకోవడానికే అక్కడికి వెళ్లాడని పేర్కొన్న ఆయన వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదని అన్నారు.