YCP MLA Anam: వైసీపీ ఎమ్మెల్యే ఆనంకు ఊహించని షాక్?
Shock to Anam: సొంత పార్టీ , ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ అధిష్టానం మరో షాక్ ఇచ్చింది. గడప గడపకు మన ప్రభుత్వం ఇంచార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ఇంచార్జ్ బాధ్యతలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయగా.. ‘ఇప్పటివరకు మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు’ అని ఆనంకు మెసేజ్ పంపినట్టు తెలుస్తోంది. అదే విధంగా రామ నారాయణరెడ్డి నిర్వహించే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయడంతో ఆయన స్థానంలో వెంకటగిరి ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. అయితే ఆనం కూడా నేదురుమల్లి వచ్చినా తగ్గేదే లేదన్నట్లు మరో ఏడాదిన్నర వరకు వెంకటగిరి ఎమ్మెల్యేని తానేనని.. అధికారిక కార్యక్రమాల్లో ముందుంటున్నారు. నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అనే వ్యక్తే అసలు లేరు అన్నట్లుగా ఆయన నడుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో తన పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడంతో ప్రభుత్వం ఈ మేరకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.