Vijayasai Reddy New Strategy: కాంగ్రెస్ దగ్గరవుతున్నాడా?
Vijayasai Reddy New Strategy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారశైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ నేతలతోనూ, పార్టీ అధినాయకుడితోనూ సఖ్యతగా ఉండే విజయసాయి రెడ్డి ఇటీవల కాలంలో ఆ పార్టీ నేతల కంటే ఇతర పార్టీ నేతలతో ఎక్కువగా టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇటీవల రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీలు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్‌తో విజయసాయి రెడ్డి వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. జైరామ్ రమేష్ విజయసాయి రెడ్డి భుజంపై చేయివేసి మాట్లాడారు.
ఆ సమయంలో విజయసాయిరెడ్డి వినయంగా జైరామ్ రమేష్‌తో వ్యవహరించడం ఢిల్లీలో చర్చగా మారింది. వైసీపీ నేత కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీని ఆకట్టుకునేందుకు, బీజేపీ పెద్దలను అకట్టుకునే విధంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో కూడా అదేవిధంగా సఖ్యతగా వ్యవహరిస్తుండటం ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పెద్దలు సోనియా నుంచి అందర్ని విమర్శించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు అంత సడెన్‌గా కాంగ్రెస్ నేతలతో సఖ్యతగా ఉంటున్నారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఢిల్లీలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకు అందిస్తున్నారు వైసీపీ నేతలు.