MLA Mekapati Chandrasekhar Reddy: మేకపాటి కుటుంబంలో కలకలం రేపుతున్న వివాదం.. కొడుకునని ఒప్పుకోవాలని
MLA Mekapati Chandrasekhar Reddy:ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి బారి షాక్ తగిలింది. ఆమధ్య మేకపాటి తమ కుటుంబంలో కొందరు చిచ్చు పెట్టారని.. దీన్ని చల్లార్చుకోలేక చచ్చిపోతున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అదే విషయం పై బహిరంగంగా ఓ లేఖ కలకలం రేకిస్తుంది. పద్దెనిమిదేళ్లు రహస్యంగా కాపురం చేసి తమను విడిచిపెట్టారంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
ఇటీవల తనకి కుమారుడే లేడని చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన తరవాత మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ ఇప్పుడు కలకలం రేకిత్తిస్తోంది. మరి తానెవ్వరిని అంటూ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా? అంటూ సూటి ప్రశ్నలు వేశారు. తన తల్లి తరువాత పరిచయమైన ఆమెని సమాజానికి పరిచయం చేశావంటూ నిలదీశారు. కుమారుడిగా తనని ఒప్పుకోవాలంటున్న మేకపాటి శివచరణ్ రెడ్డికి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాసారు. ఈ బహిరంగ లేఖపై ఎమ్మెల్యే మేకపాటి ఇంకా స్పందించలేదు. .