TDP: TDP: ఆ ప్లేస్ లో కూడా పట్టు కోల్పోయిన టిడిపి?
YSRCP Getting Strong Hold at Legislative Councel of Andhra Pradesh: అవును నిజమే, ఇప్పుడు టీడీపీ శాసన మండలిలో కూడా తన పట్టు కోల్పోతోంది. 2019లో వైసీపీ గెలిచే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో 32 సభ్యులుగా ఉన్న టీడీపీ బలం 2023 జూలై నాటికి నాలుగుకు పడిపోనుంది. రాష్ట్ర శాసన మండలిలో ఇప్పటికే 16 మంది ఎమ్మెల్సీలను కలిగి ఉన్న ఆ పార్టీ ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో 12 సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బచ్చుల అర్జునుడు, మంతెన సత్యనారాయణ రాజు, చిక్కాల రామచంద్రరావు, బీటెక్ రవి, కేఈ ప్రభాకర్, అంగర రామ్మోహన్, జీ దీపక్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలకు మరికొద్ది నెలల్లో పదవీ కాలం ముగియనుంది. శాసనమండలిలో యనమల రామకృష్ణుడు, పి అశోక్ బాబు, డి రామారావు, వి తిరుమల్ నాయుడు మాత్రమే టిడిపికి మిగిలారు. వారు కూడా 2025 నాటికి పదవీ విరమణ చేయనున్నారు. ఆయితే 58 మంది సభ్యుల రాష్ట్ర శాసన మండలిలో వైఎస్సార్సీపీకి ఇప్పటికే 32 ఎమ్మెల్సీలు ఉండగా, ఎన్నికల్లో మరో 17 మంది ఎమ్మెల్సీలు దక్కించుకుని తమ సంఖ్యను 49కి పెంచుకోనుంది. 2019 మేలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు శాసనమండలిలో కేవలం తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉండగా, టీడీపీకి 33 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ లేకపోవడంతో మూడు రాజధానుల బిల్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం వంటి కొన్ని చట్టాలు మండలిలో ఆమోదింప చేసుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది కానీ ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అవుతోంది.