YSRCP Failure: రాయలసీమలో వైఫల్యం వైసీపీ స్వయంకృతమా?
YSRCP Failure: ఏపీలో జరిగిన కొన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దాదాపుగా మూడు పట్టభద్రుల స్థానాలకు పోటీ జరిగితే మూడింటిలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందిన అంశం హాట్ టాపిక్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ జిల్లాలలో అంటే చిత్తూరులోని కొన్ని నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని చోట్ల వైసీపీది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. ఇక్కడ సదరు పార్టీకి ఎదురే ఉండాలని పంచాయతీ వార్డు మెంబర్ మొదలు పార్లమెంట్ వరకు వైసీపీ అభ్యర్థుల విజయం సాధిస్తారని ప్రచారం ఉంది. ఎందుకంటే సీట్ల కోసం సొంత పార్టీ నేతలు మధ్యనే విపరీతమైన పోటీ ఉంటుంది. కొంతమంది సీటు దక్కక పోతే వైసీపీ రెబల్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తారు.
అక్కడ అంతలా వైసీపీకి క్యాడర్ ఉంది. అలాంటి చోట అంటే తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఫలితాలు రెండు ఆ పార్టీకి షాక్ ఇచ్చాయని చెబుతున్నారు. ఈ విషయంలో ఎలా కవర్ చేసుకోవాలో తెలియక కొత్త కారణాలు వెతుక్కుంటున్నారని వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్లో డబ్బులు వేస్తూ దాన్ని అభివృద్ధి అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. అయితే ఈ విషయం మీద ప్రజల్లో కొంతవరకు బాగానే ఉన్నా సింహభాగం ఎవరూ సాటిస్ఫై అవ్వడం లేదు. అయితే దాన్ని అర్థం చేసుకోకుండా ప్రభుత్వం మాత్రం 175 కి 175 స్థానాలు మనకెందుకు రావు అనుకుంటూ ముందుకు వెళుతోంది.
ఇలాంటి సమయంలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గాల్లో తేలుతున్న ప్రభుత్వాన్ని ఒక్కసారిగా కింద పడేసినట్లు అయింది. అయితే గ్రౌండ్ రియాల్టీ దెబ్బకు దిమ్మతిరిగి బొమ్మ కనబడిందని వాదన వినిపిస్తోంది. అభివృద్ధి అంటే కనీసం మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికపరంగా అభివృద్ధి చెందడం, ఉద్యోగాలు కల్పించడం, నిత్యావసరాలను అదుపులో ఉంచడం వంటివి మాత్రమే ప్రజల ఆలోచన మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. పైకి వైసిపి ఇది తమకు పెద్ద విషయం కాదని చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం జగన్ ఏమంటారో అనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఇక గెలిచిన ప్రతిసారి ఐపాక్ టీమ్ గొప్పతనం అని ఊదర గొట్టుకునే ఐపాక్ టీమ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, సదరు నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
గ్రౌండ్ రియాల్టీలో కార్యకర్తలను వసలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలకే దిక్కు లేకపోతే కార్యకర్తలను ఇంకేం పట్టించుకుంటారనే వాదన వినిపిస్తోంది. ఎంత సేపు సంక్షేమ పథకాలు వచ్చేస్తున్నాయి. ఓట్లు మనకే అని జగన్ భావించడం తప్ప గ్రౌండ్ రియాలిటీలో చాలా నెగెటివిటీ పెరిగిపోతుందనే విషయం ఎన్నికలతో క్లారిటీ వచ్చినట్టు అయింది. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకొని ఎలా దాన్ని ఓట్లుగా మలుచుకోవాలో చూసుకోకపోతే మాత్రం ఈసారి 2024 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఓడిపోయినట్టుగానే ఓడిపోక తప్పదనే అంచనాలు వెలువబడుతున్నాయి. ఒకరకంగా ఇది డేంజర్ బిల్స్ లా భావించి పనిచేస్తే తప్ప మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని అంటున్నారు.