MLC Elections: అందుకే జగన్ ధీమాగా ఉన్నాడా?
MLC Elections: ఈ నెలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయుల కేటగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉపాద్యాయులు ఓటు వేస్తారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గ్రాడ్యుయేట్లు వైసీపీకి అనుకూలంగా ఉండబోరని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఉపాధ్యాయులు తమకే అనుకూలంగా ఉన్నారని, ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒక్క సీపీఎస్ విషయంలో మాత్రమే కొంత వ్యతిరేకత ఉందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే సీపీఎస్ విధానం అమలౌతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఉద్యోగుల పీఆర్సీతో సహా అన్ని బకాయిలను క్లియర్ చేస్తున్నామని, తెలంగాణలో సైతం సరిగా జీతాలు అందడం లేదని అక్కడి మంత్రులే చెబుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో పరిస్థితులు సరిగా లేవని చెబుతున్నారని, కానీ అనుకున్నంతగా పరిస్థితులు లేవని, అన్నీ సక్రమంగానే ఉన్నాయని, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఇదేవిధమైన పరిస్థితులు ఉన్నాయని ఏపీ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉద్యోగులతో చాలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తోందని, ఉద్యోగులను భద్రంగా చూసుకుంటోందని నేతలు చెబుతున్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తమ నేత జగన్ ధీమాగా ఉన్నారని, విజయం తమదేనని అంటున్నారు.