MLC results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా..ఆధిక్యంలో అధికార పార్టీ అభ్యర్ధులు
YSRCP Candiates are leading in MLC Counting
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానం లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి ఆధిక్యత కనబరుస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డిమొదటి రౌండ్ లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నారు. రెండో స్థానంలో ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మూడో స్థానం లో కొనసాగుతున్నారు. మరికొన్ని గంటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం వెలువడనుంది.
ఆధిక్యంలో చంద్రశేఖర్ రెడ్డి
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యం లో దూసుకు వెళ్తున్నారు. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వైయస్ఆర్సీపీ బలపరిచిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి బాబు రెడ్డి ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి చంద్రశేఖర్ రెడ్డికి 2825 ఓట్లు లభించగా….పీడీఎఫ్ అభ్యర్థి బాబు రెడ్డికి 2515 ఓట్లు లభించాయి.