YSRCP @ 12 years: వైఎస్ఆర్సీపీ… 12 ఏళ్ల ఘనకీర్తి
YSRCP @ 12 years: సరిగ్గా 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేశారు. 2011 మార్చి 12వ తేదీన జగన్ తండ్రి స్మరణార్థం ఆయనపేరు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో పార్టీని స్థాపించారు. పార్టీ జెండా అజెండాను అదే రోజున ప్రకటించారు. తన తండ్రి వైఎస్ఆర్ మరణం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఓదార్పు యాత్రను నిర్వహించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుండే కాకుండా ఇతర పార్టీ నుండి కూడా జగన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపించారు.
దీంతో 2011లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వైపీసీ విజయడంకా మోగించింది. వైఎస్ జగన్ కడప పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఏకంగా 5లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ జగన్‌ను నిలువరించేందుకు కాంగ్రెస్, టీడీపీలు శతవిధాల ప్రయత్నించాయి. కానీ, అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. అంతేకాదు, పులివెందుల నుండి పోటీ చేసిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కూడా 80 వేల పైచిలుకు మెజారిటీని సాధించారు. అప్పటి నుండి వైసీపీ అప్రతిహాసంగా విజయాలు సాధిస్తూ వస్తున్నది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, రాయలసీమగా విడిపోయిన తరువాత జరగిన ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా 60కి పైగా స్థానాలు గెలుచుకొని సంచలనం సృష్టించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, వైసీపీ చేసిన మొదటి ప్రయత్నమే సఫలం కావడం విశేషం. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుండే రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. 175 స్థానాల్లో పోటీ చేయగా 151 చోట్ల విజయం సాధించింది. అంతేకాదు, పార్లమెంట్ విషయానికి వస్తే 22 చోట్ల విజయం సాధించింది.
2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నది. ఈ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జగరనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించాలని వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
2019 ఎన్నికల్లో సాధించిన 151 స్థానాలు నిలుపుకోవడమే కాకుండా, అదనంగా మరికొన్ని స్థానాల్లో కూడా పాగా వేయాలని వైసీపీ చూస్తున్నది. ఇచ్చిన హామీలతో పాటు, ప్రజలకు అదనంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, సంక్షేమ పథకాలే పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయని నేతలు బలంగా నమ్ముతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జగరడంలేదన్నది అవాస్తవమని నేతలు చెబుతున్నారు. రాజధాని విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకు అడుగులు వేస్తున్నది.