రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 మధ్య కాలంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంద చేస్తోంది.
YSR Matsyakara Bharosa: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 మధ్య కాలంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంద చేస్తోంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా సీఎం జగన్ నేడు నిధులు విడుదలచేయనున్నారు. ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,460 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ. 108 కోట్లతో కలిపి, మొత్తం రూ. 231 కోట్ల సాయాన్ని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. తాజాగా అందిస్తున్న ఈ ఆర్థిక సాయంతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 538 కోట్లు. ఏటా రూ. 10 వేల చొప్పున ఈ ఒక్క పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేల లబ్ధి చేకూరింది. గతంలో వేట నిషేధ భృతి రూ.4వేలు ఉండగా.. జగన్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచింది.
గత ప్రభుత్వం చేయని మంచిని తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని వివరిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే తనకు అండగా నిలవాలని కోరుతున్నారు. లబ్ది దారులే సైనికులుగా మారాలని సూచిస్తున్నారు. పొరపాటున ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తున్నారు. పేదలు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదని అప్రమత్తం చేస్తున్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే..ప్రజలకు తాను చెప్పదలచుకున్న అంశాలను స్పష్టం చేస్తున్నారు.