గంగిరెడ్డికి బెయిల్ రద్దు - చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం
Ys Viveka Murder Case : వైఎస్ వివేకా (YS Viveka) హత్య (Murder) కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగి రెడ్డి (Gangi Reddy)కి షరతులతో కూడిన బెయిల్ (Bail) రద్దుపై సుప్రీం కోర్టు (Supreem Court) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు తీర్పు (Judgement)ను పరిశీలించిన చీఫ్‌జస్టిస్ (CJI)వైవీ చంద్రచూడ్…గంగిరెడ్డి బెయిల్ ను రద్దుచేసి ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణ వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది. ఈకేసు ను వెకేషన్ బెంచ్ వచ్చే వారం పరిశీలించనుంది.
హై కోర్టు ఏం చెప్పిందంటే…
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చింది.. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీం ఆదేశించినందువల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. జులై 1న మళ్లీ బెయిల్ పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సుప్రీంను ఆశ్రయించారు సునీతారెడ్డి.. బెయిల్ ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తన పిటిషన్లో సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు సునీతారెడ్డి. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టులో ఇటీవల లొంగిపోయాడు. వైఎస్ వివేకా హత్య కేసులో 2019 మార్చి 28న పోలీసులు ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేశారు.