Vivekananda Reddy Death Anniversary: నాలుగేళ్లైనా కొలిక్కిరాని వివేకా కేసు
Vivekananda Reddy Death Anniversary: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నేటికి నాలుగేళ్లు పూర్తైంది. ఇప్పటి వరకు ఈ హత్యకు సంబంధించిన సూత్రధారులు ఎవరు, ఎందుకు హత్యచేశారు అనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అధికారులు ఆదుపులోకి తీసుకున్నారు. మొదట్లో ఈ కేసును సిట్ విచారించగా, పక్కదారి పడుతోందని భావించిన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైదరాబాద్ కేంద్రంగా సీబీఐ విచారణ చేపడుతున్నది.
ఈ కేసును వేగంగా పూర్తి చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే అనుమానితులను, పాత్రధారులను అదుపలోకి తీసుకున్నది. అయితే, హత్యవెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగుమార్లు విచారించారు. వరస విచారణలతో సీబీఐ దూకుడు పెంచింది. ఎలాగైతా సూత్రధారులను అదుపులోకి తీసుకుంటామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. అయితే, వివేకా హత్యజరిగి నేటికి నాలుగేళ్లు పూర్తికావడంతో నేడు పులివెందులలో కుటుంబ సభ్యులు వర్థంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారా లేదా అన్నది చూడాలి.