Avinash Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా మర్డర్ కేసు (YS Viveka murder case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash reddy) బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
Avinash Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా మర్డర్ కేసు (YS Viveka murder case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash reddy) బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు రోజులుగా తెలంగాణ హైకోర్టులో (Telangana high court) విచారణ జరుగుతోంది. శనివారం సీబీఐ తరుపున లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 31కి వాయిదా వేసింది. అలాగే అవినాశ్ రెడ్డికి కాస్త ఊరట కల్పించింది. తుది తీర్పును ప్రకటించే వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని (CBI) ఆదేశించింది. ఈ మేరకు అవినాశ్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐ తరుపున న్యాయవాది అనిల్ ఇవాళ కోర్టులో వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి మొదటి నుంచి దర్యాప్తుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని.. విచారణకు సహకరించడం లేదని కోర్టుకు వివరించారు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని అవినాశ్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వగానే.. ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరు కావడం లేదని తెలిపారు. దర్యాప్తును తమ పద్ధతి ప్రకారం చేస్తామని.. అవినాశ్ రెడ్డి కోరుకుట్లు కాదని స్పష్టం చేశారు.
అలాగే అవినాశ్ రెడ్డి సీబీఐకి తప్పుడు సమాచారం ఇచ్చారని లాయర్ అనిల్ కోర్టుకు వివరించారు. వివేకా మర్డర్ జరిగిన రోజున అవినాశ్ రెడ్డి జమ్మల మడుగు వెళ్లినట్లు చెప్పారని.. కానీ ఆరోజు ఎన్నికల షెడ్యూల్లో అవినాశ్ జమ్మల మడుగు వెళ్లినట్లు లేదని పేర్కొన్నారు. తన అనుచరుల ద్వారా అవినాశ్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. అందుకే సాక్షం చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వెల్లడించారు. కొందరు సాక్షుల వాగ్మూలాలను రికార్డ్ చేశామని.. వాటిని కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. ఇక అవినాశ్ రెడ్డిని మరోసారి బుధవారం విచారణకు పిలుస్తామని సీబీఐ కోర్టుకు వివరించింది.
ఇక ఈ కేసు దర్యాప్తు రోజురోజుకు జాప్యం అవుతుండడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల కేసులను కూడా ఇన్ని రోజులు విచారిస్తారా అని సీబీఐని ప్రశ్నించింది. అసలు వివేకా హత్య వెనుక ఉన్న ప్రధాన కారణమేంటని అడిగింది. దానిపై స్పందించిన సీబీఐ తరుపున లాయర్ అనిల్.. రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాజకీయంగా వివేకాపై పైచేయి సాధించాలని అవినాశ్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారని వెల్లడించారు. అలాగే హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి వాట్సాప్లో ఎవరితోనో కీలకవ విషయాలు మాట్లాడినట్లు గుర్తించామని వివరించారు. మరి అవినాష్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారా.. కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి అని సీబీఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.