YS Jagan: వైసీపీ గీత దాటిన వారంతా గప్ చుప్?
YS Jagan Serious: వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ముక్కు సూటిగా వ్యవహరిస్తారని పేరు ఉంది, ప్రజలకు సేవ చేయడంలో ఎంత దాతృత్వం కనబరుస్తారో పార్టీ విషయంలో క్రమశిక్షణ తప్పితే అంత ముక్కుసూటిగా దండించడానికి ఏమాత్రం వెనకాడారనే పేరు ఉంది. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈ మధ్యకాలంలో పార్టీ మాట పక్కన పెట్టి దిక్కార స్వరం వినిపిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ముందుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలా ధిక్కార స్వరం వినిపించి పార్టీకి దూరమయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో అనేకమంది నేతలు ఇలాగే పార్టీ మీద ప్రభుత్వం మీద పార్టీ నేతల మీద విరుచుకు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు అలాంటి వారి మీద జగన్ చూసి చూడనట్లుగానే వ్యవహరించారు కానీ ఇప్పుడు ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా వరుసగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బయటపడుతూ ఉండడంతో జగన్ వారిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితులలో క్రమశిక్షణ దాటి పార్టీ లైను దాటి వ్యవహరించిన వారి విషయంలో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్న ఆయన అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని వారికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించాలని కంకణం కట్టుకున్న జగన్ గ్రూపు రాజకీయాల మీద, లోకల్ క్యాడర్ మధ్య ఏర్పడుతున్న వివాదాల మీద కూడా చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీద వేటు వేసి పక్కన కూర్చోబెట్టిన ఆయన మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇదే విధంగా అధికారుల ముందు, అధికారుల మీద కఠినంగా మాట్లాడుతూ ఉండడంతో ఆయనను క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని జగన్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.
అభివృద్ధి పనుల విషయంలో ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న తమ మీద ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పర్చూర్ అసెంబ్లీ విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్నారని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ సైలెంట్ గా ఉండడంతో ఆ వారిని పక్కన పెట్టి ఆ బాధ్యత ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆమంచి కృష్ణమోహన్ కు అప్పగించారని అంటున్నారు. కేవలం ఇవి ఉదాహరణలు మాత్రమే, ఎక్కడ ఎవరు పార్టీ మీద సీరియస్ కామెంట్స్ చేస్తున్నా జగన్ ఉపేక్షించే పరిస్థితి లేదని వారందరికీ ఎక్కడికి అక్కడ వార్నింగ్ ఇస్తూ ఆయన ఎక్కడికక్కడ ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారని తెలుస్తోంది. జగన్ ఈ విషయం మీద సీరియస్ అవుతూ ఉండడంతో ఇప్పటివరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మీద ప్రభుత్వం మీద కామెంట్లు చేస్తున్న నేతలు సైతం ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. మాజీ మంత్రి సుచరిత కూడా నిన్న మొన్నటి వరకు అనేక వ్యాఖ్యలు చేసినా వైఎస్ జగన్ పిలిపించుకుని మాట్లాడిన తర్వాత మాత్రం సైలెంట్ అయ్యారు. తాను మరో పార్టీలోకి వెళ్లే ఉద్దేశమే లేదంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న అందరినీ జగన్ సైలెంట్ చేయించారనే చెప్పాలి.