పుష్ప చిత్రంలో నటనకుగాను తొలిసారిగా జాతీయ అవార్డు గెలుచుకున్న హీరో అల్లు అర్జున్‌ని, పాన్-ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోయిన RRR చిత్రానికి అవార్డులపై సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
YS Jagan : 69వ జాతీయ సినిమా అవార్డుల్లో(69th National Film Awards) తెలుగు తేజాలు సత్తా చాటాయి. ముఖ్యంగా పుష్ప సినిమాకుగాను(Puspha cinema) జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(National best actor Allu Arjun) ఎంపికయ్యారు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్(RRR) కూడా పలు విభాగాల్లో అవార్డులు గెల్చుకుంది. దీంతో తెలుగు వారంతా సంతోషంలో మునిగిపోయారు. అల్లు అర్జున్‌తోపాటు ఆర్ఆర్ఆర్ చిత్రంలో పనిచేసి అవార్డులు గెల్చుకున్న వారికి అభినందలు తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.
ఇదే క్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడా అల్లు అర్జున్‌తోపాటు ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. పుష్ప చిత్రంలో నటనకుగాను తొలిసారిగా జాతీయ అవార్డు గెలుచుకున్న హీరో అల్లు అర్జున్‌ని, పాన్-ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోయిన RRR చిత్రానికి అవార్డులపై సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని.. వివిధ రంగాల్లో మొత్తం ఆరు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్(CM Jagan) తెలిపారు. ఆర్ఆర్ఆర్కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, చంద్రబోస్ ఉత్తమ సాహిత్యానికి (కొండ పొలం) ఇతర అవార్డులను గెలుచుకున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.
టాలీవుడ్ పరిశ్రమ పెద్దలతో మొదట్లో అంటీ ముట్టనట్లుగా ఉన్న జగన్ ఆ తర్వాత సత్సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ రావడంతో ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారు. ఈ తరుణంలో ఇంతమంది నటీనటులు, ఇతర సిబ్బందికి ఫిల్మ్ అవార్డులు రావడంతో వైఎస్ జగన్ అభినందనలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ స్పందనతో అవార్డులు గెల్చుకున్న నటుల అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.