Ys Jagan: దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా..నా ధైర్యం మీరే, నా నమ్మకం మీరే
Ys Jagan: ఈరోజు తిరువూరు సభలో కీలక వ్యాఖ్యలు చేసిన జగన్ అనంతరం తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆయన దుష్టచతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తున్నా, నా ధైర్యం మీరే, నా నమ్మకం మీరే అని కామెంట్ చేశారు. నన్ను నడిపించేది మీరేనని పేర్కొన్న జగన్ నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడే పరిస్ధితి ఉంటే అది ఆ దేవుడి మీదా, మీ మీద మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా అని కామెంట్ చేశారు. ఇలాంటి దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం, ఇవాళ ఆ దుష్టచతుష్టయాన్ని ఒక్కటే అడుగుతున్నాను, నేను వారికి సవాల్ విసురుతున్నానమొ జగన్ అన్నారు. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే, వారు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు ? ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ? అని ఆయన ప్రశ్నించారు. గ్రామ గ్రామానికి, ఇంటింటికీ అందిన అభివృద్ధి ఫలాలు మీద కానీ, సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, అవ్వాతాతలకు అందించిన సంక్షేమ ఫలాలు మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు అర్హత లేని వారు మన ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారని అన్నారు.