YS Avinash Reddy: అందుకే వివేకా హత్య.. అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు!
YS Avinash Reddy: వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మర్డర్ కేసు విషయంలో ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నానని, అయితే ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని వైసీపీ క్యాడర్ నన్ను ప్రశ్నిస్తోందని పేర్కొన్న ఆయన ఇక నుండి నేను మాట్లాడటం మొదలు పెడతానని అన్నారు. వివేకా ది మర్డర్ ఫర్ గైన్ అని ఆయన ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆమెకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని, అంతేకాదు వివేకా సార్ ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆస్థులన్ని వాళ్లకు వెళ్లిపోతాయి, రాజకీయ వారసులుగా వస్తారని, సునీతమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశాడని నా అనుమానం అని ఆయన అన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్ ని మాయం చేశారని పేర్కొన్న ఆయన నేను గుండెపోటు అని చెప్పలేదని ఇదంతా టీడీపీ వాళ్ళు చిత్రీకరించారని అన్నారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన నా సోదరి సునీతమ్మ హై కోర్టులో సుప్రీంకోర్టు లో అనేక ఆరోపణలు చేసిందని, ఏ ఒక్క రోజు నేను ఎవరి గురించి మాట్లాడలేదని పేర్కొంది. నేను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారని ఆయన అన్నారు.