CBI Notices: వైఎస్ అవినాష్ కి సీబీఐ పిలుపు..5 రోజులు సమయం ఇవ్వండి
YS Avinash Reddy Notices: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది, ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. దీనికి స్పందనగా తాను పూర్తిగా సహకరిస్తానని, విచారణకు వచ్చేందుకు అయిదు రోజుల సమయం ఇవ్వాలని ఎంపీ అవినాశ్ సీబీఐకు లేఖ రాసారు. ఇప్పుడు సీబీఐ వైసీపీ ఎంపీకి నోటీసులు ఇవ్వటంతో వివేకా హత్య కేసు విచారణ కొత్త మలుపు తీసుకుంది.
సోమవారం వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసర ప్రాంతాలను సీబీఐ పరిశీలించింది. కొన్నాళ్ల క్రితం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఇప్పటికే ఈ కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. రేపు ఇదే కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించునున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 207 మందిని విచారించిన సీబీఐ అధికారులు… 146 మంది వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకున్నారు. పలువురు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు వెలుగులోకి రావడంతో గత ఏడాది మొదట్లోనే వారిని విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో అప్పట్లో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి కొందరు అధికారులు పులివెందులకు వెళ్లి సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు వారు నిరాకరించినట్టు సమాచారం. దీంతో, కడప జిల్లా కోర్టును కూడా వారు ఆశ్రయించారు.
ఈ కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ నోటీసులు జారీ చేసినట్టు చెబుతున్నారు, ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీబీఐ, అవినాష్ రెడ్డి కార్యాలయాన్ని పరిశీలించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పరిశీలించింది సీబీఐ. వివేకానంద హత్య కేసును ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఇక మరికొద్ది రోజుల్లోనే కేసు ట్రయల్స్ కు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరి స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి, ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి పాత్ర పై నిగ్గు తేల్చనుంది సీబీఐ. హత్య జరిగిన తర్వాత నిందితులు అవినాష్ రెడ్డికి కాల్ చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వెనుక వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది, ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి పాత్ర పై హైదరాబాద్ లో సుదీర్ఘంగా విచారణ చేయనుంది అధికారులు.