విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కార్మాగారం ప్రవేటీకరణ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని విశాఖలోని గాజువాక జంక్షన్ వద్ద వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, కరోనా సమయంలో ఎంతో మందిని కాపాడిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం అమ్మేయాలని చూస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు వైసీపీ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికిదిగారు. టీడీపీ శ్రేణులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ గొడవ అంతా ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా సమక్షంలోనే జరిగింది.