Mla Gopireddy Srinivas Reddy: పవన్ సీఎం అయితే మేం సపోర్ట్ చేస్తాం.. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
Mla Gopireddy Srinivas Reddy: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ-జనసేన మధ్య ఈసారి ఎన్నికల్లో పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆలోపే ఇరు పార్టీలకు చెందిన నేతలు పార్టీలు ఫిరాయించడమో, ఆ వ్యూహాలు రచిస్తుండటమో చేస్తున్నారు. ఏపీలో టీడీపీ-జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే పొత్తులు పెటుకోవాల్సిందే. లేదంటే అటు టీడీపీకి ఇటు జనసేనకు నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ బలోపేతంగా ఉన్న సీట్లపై పవన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సంచలమైన కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మా సపోర్ట్ ఉంటుందని బాంబ్ పేల్చాడు.
నరసరావు పేట అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మేం కూడా సపోర్ట్ చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబును తలకెక్కించుకోడానికి పవన్ పాట్లు పడుతున్నాడని ఆగ్రహంవ్యక్తం చేసారు. ఆయన ముఖ్యమంత్రి అయితే మేమెంత వారికీ సపోర్ట్ చేస్తామని అన్నారు. ఇప్పడు ఈ వార్త వైసీపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
support