Ycp Mla Madhusudhan Reddy: వాల్తేరు వీరయ్య చాలా బాగుంది.. వైసీపీ ఎమ్మెల్యే
Mla Madhusudhan Reddy: మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రవితేజతో కలిసి పక్కా కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాని అభిమానులకు ఇచ్చారు. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది ఈ చిత్రం. విడుదలైన మూడు రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. వంద కోట్ల మైలురాయిని అధిగమించింది. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే వసూళ్లతో దుమ్మురేపుతోంది. సినిమాపై అభిమానులే కాకుండా.. సగటు ప్రేక్షకులు, సినీ ప్రియుల సైతం పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు వైసీపీ ఎమ్మెల్యే ప్రమోషన్ చేసారు.
శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్తేరు వీరయ్య సినిమా చూసారు. తన కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూశారు. ఈ సందర్భంగా థియేటర్ ఆవరణలో కేక్ కట్ చేశారు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవికి అభిమానిని అని వెల్లడించారు. సినిమా చాలా బాగుందన్నారు. వైసీపీలోని చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ సినిమా చూపించాలన్న ఉద్దేశంతో థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి.. తన కుటుంబ సభ్యులతో కలిసి చూశామని అన్నారు.
అన్నదమ్ముల అనుబంధంతో ‘వాల్తేరు వీరయ్య’ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడండి అంటూ ఆయన ట్వీట్ చేయడమే గాక సోషల్ మీడియాలో తాను సినిమా వీక్షించి తర్వాత కేక్ కట్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయం మాట్లాడితే ఈ విషయం చాలా దూరం వెళుతుంది అంటూనే అన్నయ్యని చూసి తమ్ముడు చాలా నేర్చుకోవాలి అంటూ పరోక్షంగా పవన్ పై పంచ్ వేశారు.
నేను చిన్నప్పటి నుండి @KChiruTweets గారి అభిమానిని,సంక్రాంతి సందర్భంగా నా మిత్రులు అలాగే శ్రీకాళహస్తి @YSRCParty కుటుంబ సభ్యులందరితో కలిసి "వాల్తేరు వీరయ్య" చిత్రాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది.
అన్నదమ్ముల అనుబంధంతో వాల్తేరు వీరయ్య చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పక చూడండి. pic.twitter.com/9DslDMo3Yt
— Biyyapu MadhuSudhan Reddy – MLA (@BiyyapuMadhu) January 15, 2023