Perni Nani: యువశక్తి సభలో సీఎం జగన్ పై పవన్ ఘాటు విమర్శలు, కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేతలు
YCP leaders condemn the comments of Pawan Kalyan
శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి రోజా తదితరులు పవన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై పేర్ని నాని మండిపడ్డారు. స్పీచ్ అంతా ఆత్మస్తుతి, పర నిందా తప్ప మరోటి లేదని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతకు స్ఫూర్తి నింపుతాను అని నెల రోజుల నుంచి చెబుతూ వచ్చారని, కానీ ప్రసంగంలో అవేవీ లేవని విమర్శించారు.
సినిమా భాష మాత్రమే తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక కుసంస్కారి, దిగజారిన వ్యక్తి అని నాని మండిపడ్డారు. మూడు, నాలుగు వేల మంది ఉన్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడాడని నాని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను కుసంస్కారంతో మాట్లాడటం మినహా ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు. జగన్ అంటే పవన్ కళ్యాణ్ కు ద్వేషం, అసూయ అని నాని విమర్శించారు.
మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్ లు కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఎటాక్ చేశారు.రోజా డైమండ్ రాణి అయితే నువ్వు బాబుగారి జోకర్ వి అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అమ్మను తిట్టారని ఏడ్చి, అలగా జనం అన్నారని ఏడ్చి ఆఖరికి వాళ్ల పల్లకీనే మూస్తున్న పవన్ కళ్యాణ్ ను బానిస అనక బాహుబలి అంటారా అని మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు.
రోజా డైమండ్ రాణి అయితే
నువ్వు బాబు గారి జోకర్ వి ! @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 12, 2023
అమ్మను తిట్టారని ఏడ్చి, అలగా జనం అన్నారని ఏడ్చి ఆఖరికి వాళ్ల పల్లకినే మోస్తూన్న పవన్ కళ్యాణ్ ని బానిస అనక బాహుబలి అంటారా? #PackageStarPK
— Gudivada Amarnath (@gudivadaamar) January 12, 2023
మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. రెండు సార్లు గెలిచిన నేను..రెండు చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ తో తిట్టించుకోవాలా.. తూ ..ప్రజల కోసం తప్పట్లేదని ట్వీట్ చేశారు.
రెండు సార్లు గెలిచిన నేను..
రెండు చోట్ల ఓడిపోయిన..@PawanKalyan నీతో తిట్టించుకోవాల..? తూ…
ప్రజల కోసం తప్పట్లేదు..!!#PackageStar pic.twitter.com/4yMESHNz8L— Roja Selvamani (@RojaSelvamaniRK) January 12, 2023