Ys Bhaskar Reddy: సీబీఐ గెస్ట్ హౌస్ నుంచి వెళ్లిపోయిన భాస్కర్ రెడ్డి
Ys Bhaskar Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉన్నందు వల్ల విచారణకు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈనెల 12 న హాజరుకావాలని పేర్కొంది. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు, ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించారు. ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను కూడా అధికారులు ఇప్పటికే విచారించారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే సీబీఐ ఒక సారి భాస్కర్ రెడ్డి..మూడు సార్లు అవినాశ్ రెడ్డిని విచారించింది. ఇదే సమయంలో ఈ రోజు భాస్కర రెడ్డి సీబీఐ విచారణ కోసం కడప జైలుకు వెళ్లారు. అయితే, విచారణ అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ రోజు భాస్కర రెడ్డి సీబీఐ విచారణ కోసం వెళ్లారు. అయితే విచారణ అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. భాస్కర్‌రెడ్డితో పాటు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివెళ్లారు.