సైకిలెక్కే యోచనలో వైసీపీ నేత?
నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు వినూత్న నిరసన చేపట్టారు. డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ అఖిలపక్షం నిరసనలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు ఆయన మద్దతు తెలిపారు. నరసాపురం జిల్లా కేంద్రం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సుబ్బరాయుడు ప్రకటించారు. దీనిపై కొద్దిరోజుల క్రితమే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌రాజుపై సుబ్బరాయుడు ఆయన విరుచుకుపడ్డారు. ఆయనని ఎమ్మెల్యేను చేసినందుకు గాను చెప్పులతో కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మంత్రిగా పేర్ని నాని సుబ్బరాయుడుపై విమర్శలు చేశారు. ఇప్పుడు టీడీపీ నేత చేస్తున్న నిరాహార దీక్షకు సుబ్బారాయుడు మద్దతివ్వడంతో త్వరలో సైకిల్ పార్టీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించిన సుబ్బరాయుడు 2009 నుంచి రాజకీయ పరంగా తప్పుడు అడుగులు వేయడం మొదలు పెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తరువాత, తిరిగి టీడీపీలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికలకు ముందు టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరారు.