నేను లేకుంటే గౌతమ్ రెడ్డి రాజకీయాలకు వచ్చేవాడు కాదేమో: జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరులోని గొలగమూడి కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంతాప సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి ప్రతీ అడుగులో తనకు తోడుగా ఉన్నారన్నారు. తనకు గౌతమ్ రెడ్డి చిన్న తనం నుంచే తెలుసన్న జగన్.. తాను లేకుంటే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చే వాడు కాదేమో అన్నారు. రాజకీయల్లో గౌతమ్ రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు.
గౌతమ్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఆరు శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు. గౌతమ్ రెడ్డి తనకు మంచి స్నేహితుడన్న సీఎం.. తాను మంచి వ్యక్తిని కోల్పోయానన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామి ఇచ్చారు. గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం మే 15లోగా సంగం బ్యారేజ్‌ను ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేశారు.