Yuvagalam: ఇలా అయితే నాలుగు లక్షల కిలమీటర్లు తిరిగినా ఉపయోగం లేదు!
Nara Lokesh Yuvagalam: ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో ఒకపక్క చంద్రబాబు కష్టపడుతుంటే మరోపక్క నారా లోకేష్ కూడా ఈ మధ్యనే యువ గళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజులు 4,000 km టార్గెట్ పెట్టుకున్న ఆయన ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి 400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసి మరింత ముందుకు వెళుతున్నారు. ఈ యాత్ర ద్వారా తెలుగుదేశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడమే కాక తెలుగుదేశం కార్యకర్తల్లో ధైర్యం నింపి తానున్నానని భరోసా ఇచ్చేందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు చాణక్యంతో ఈ పాదయాత్ర షెడ్యూల్ ను పకడ్బందీగా సిద్ధం చేశారు.
లోకేష్ ప్రసంగాలను సైతం ప్రత్యేకంగా రచించి ఆయన చేత పలికించడానికి కొందరు వ్యక్తులను కూడా నియమించారు. ఇప్పటికే 31 రోజులపాటు యువ గళం పాదయాత్ర ఘనంగా సాగుతోంది. ఇంకా 400 కిలోమీటర్ల పైనే లోకేష్ పూర్తి చేశారు. ఈ యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎంత మైలేజ్ పెరిగిందా? లోకేష్ పాదయాత్రకు నిజంగానే ఆదరణ లభిస్తుందా? ఆయన ప్రసంగాలు ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాయా? అంటే ఎవరు ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపద్యంలోని టిడిపి అధినేత చంద్రబాబు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది కానీ చంద్రబాబు ఆశించిన స్థాయిలో మాత్రం ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన రావడంలేదని భావిస్తున్నారట.
ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి ద్వారా రాష్ట్రం ఎలా నష్టపోతోంది? అనే విషయం మీద లోకేష్ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ప్రజలకు ఏ స్థాయిలో మెరుగైన పాలనందిస్తామని విషయాన్ని చెప్పే విషయంలో విఫలమవుతున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలు కంటే మెరుగైన పథకాలను ఎలా అమలు చేస్తాము? స్థానికంగా ఉన్న సమస్యలను ఎలా క్లియర్ చేస్తాం? ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఎలా పరిష్కరిస్తామని విషయాన్ని క్లారిటీగా చెప్పకుండా ఆయన ఎంతసేపు వైసిపి నేతలను జగన్ను విమర్శించే పనిలోనే ఉన్నారని అంటున్నారు.
ఇలా జగన్ లేదా వైసీపీని విమర్శించడం వల్ల టిడిపి కార్యకర్తలు ఆనంద పడతారేమో తప్ప. సాధారణ ప్రజలు మాత్రం లోకేష్ ఏంటి ఇలా అయ్యాడు అని అనుకోక తప్పదు. గతంలో వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒకపక్క చంద్రబాబు సహా నారా లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే కాదు నవరత్నాలు పేరుతో తొమ్మిది పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసి దాదాపుగా వాటితోనే గెలిచానని చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోకేష్ పాదయాత్ర పూర్తిగా జగన్ ని టార్గెట్ చేస్తూ వైసిపి మీద విమర్శలు గుప్పించడానికి అన్నట్టుగా సాగుతున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర పూర్తిస్థాయిలో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఈ విషయంలో కనుక లోకేష్ జాగ్రత్తలు తీసుకోకపోతే 400 కిలోమీటర్లు కాదు నాలుగు లక్షల కిలోమీటర్లు తిరిగినా ఉపయోగం లేదనేది ఎవరు కాదని వాస్తవం.