NTR Political Entry: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాబు, లోకేష్ పరిస్థితి ఏంటి?
NTR Political Entry: ఎన్టీఆర్ క్రేజ్ ఈ మధ్యనే తెలుగు దాటి ఇతర భాషల్లోకి వెళ్ళింది, అనుకునే అంతలోనే ఖండాంతరాలు కూడా దాటేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయన హీరోగా ఆ స్థాయికి వెళితే ఆయన అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటినుంచో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తన తాత సొంత పార్టీగా చెప్పే తెలుగుదేశం పార్టీకి 2009 ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా చేశారు, పార్టీకి మంచి మైలేజ్ కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా సరే ఎన్టీఆర్ వాక్చాతుర్యం, ఎన్టీఆర్ తీరు అందరికీ బాగా నచ్చాయి, ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఎన్టీఆర్ పొలిటికల్ గా మాట్లాడిన మాటలు టిడిపి కార్యకర్తల్లో జోష్ తీసుకురావడమే కాక ఎప్పటికైనా టిడిపికి ఆయనే కరెక్ట్ వారసుడు అని ఫిక్స్ అయ్యేలా చేశాయి.
ఇక ఎప్పటినుంచో మధ్య మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి తెలుగు దేశం పార్టీ నందమూరి వంశానిది కాబట్టి ఎన్టీఆర్ కు అప్పగించాలి అనే డిమాండ్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం పార్టీకి తాను దూరం కాదని పార్టీకి అవసరం అనుకుంటే ఎప్పుడైనా రంగంలోకి దిగడానికి సిద్ధమని చెబుతూ ఉంటారు. కానీ 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం లేదు కాబట్టి ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాడని ఎన్టీఆర్ అభిమానులు పార్టీ మనది అనుకుంటే ఆహ్వానం ఎందుకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన వచ్చు కదా అని టీడీపీలో మరో వర్గం వాదిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ గా కాస్త దూరం మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ ఈ విషయం మీద స్పందించారు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అలాగే రాష్ట్రం బాగుండాలి అనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరారు.
దీంతో రాజకీయ వాతావరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ మాటలు పక్కన పెడదాం నిజంగానే ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ల తర్వాత అయినా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, వస్తారు. వస్తే పరిస్థితి ఏమిటి అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా? జాయిన్ అయితే అప్పటికి నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ తెలుగుదేశాన్ని పూర్తిగా ఎన్టీఆర్కి అప్పగిస్తారా లేక కీలక బాధ్యతలు ఇస్తారా ? లేక నందమూరి బాలకృష్ణకు ఇచ్చినట్టుగానే ఒక ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ బాలకృష్ణలా కాదు మంచి వాక్చాతుర్యం అందరినీ కలుపుకొని వెళ్ళగలిగే చాతుర్యం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే లోకేష్ కి ఇబ్బంది తప్పదనే అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే నారా ఫ్యామిలీ సైడ్ అయిపోయి. నందమూరి ఫ్యామిలీ తెరమీదకు రావడం ఖాయం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ కి సినిమాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంది కాబట్టి ఆయన ఇప్పట్లో ఎంట్రీ ఇచ్చేది కష్టమే. ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం టీడీపీ వారు వన్ సైడ్ అయినట్లుగా ఎన్టీఆర్ కి అందరూ మొగ్గు చూపుతారు అనేది ఎవరూ కాదని వాస్తవం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేయండి.