Somu Veerraju: జనసేన పార్టీతో కలిసి అధికారంలోకి వస్తాం..సోము వీర్రాజు
Somu Veerraju: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం తమదేనని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కేంద్రంలో విద్యుత్ కోతలు తగ్గాయని రాష్టంలో పెరిగాయని అన్నారు. రోజురోజుకు ఏపీ పరిస్థితి దిగజారుతోందని అన్నారు. 2024 లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం అభివృద్ధి లేదని అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎవరు అధికారంలో ఉన్నా.. ఆ రెండు కుటుంబాల పాలనే నడుస్తుందని సోము వీర్రాజు చెప్పారు కుటుంబ రాజకీయాలను బిజెపి ప్రోత్సహించదని చెప్పారు. 10వ తరగతి పాస్ కాని వాళ్లకు కూడా పట్టభద్రుల ఓట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. వైసీసీ పాలన అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు.