Botsa: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బొత్స, కోలగట్ల కృషి
Viziangaram YCP leaders are campaigning for MLC Elections
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ విజయవంతం అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.నిన్న జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖలో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమిట్ చాలా క్రమశిక్షణ గా నిర్వహించారని, దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేతలు వచ్చారని, అందరూ ఎంతో హుందాగా ఎంవోయూలు చేసుకున్నారని బొత్స గుర్తుచేశారు. చంద్రబాబు కూడా గతంలో సమ్మిట్ లు నిర్వహించారని, మరెవ్వరూ నిర్వహించనట్టు ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
ఊరకే చెప్పుకోవడాలు కాదు… చేసి చూపించాలని బొత్స చెప్పారు. తన అధ్యక్షతనే కమిటీ వేసి ఎంవోయూలపై నిరంతరం పర్యవేక్షిస్తామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు. ఎంవోయూలే ముఖ్య కాదు.. గ్రౌండింగ్ ముఖ్యమని మా ముఖ్యమంత్రి ఆలోచన అని బొత్స తెలిపారు.
13న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
13న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని, ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవేనని బొత్స అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు లక్షల డెబ్భై వేల మంది ఓటర్లు ఉన్నారని, ఒక్క పట్టణంలోనే 17 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని బొత్స వివరించారు. ఒక్కొక్క బూత్ కు 8 వందల మంది ఉంటారని బొత్స తెలిపారు.
సీతంరాజు సుధాకర్ ని గెలిపించుకోవాలి
వారం రోజులగా శాసన మండలి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించు కోటానికి అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నామని సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. నిర్భయంగా మనం ప్రజల వద్దకు వెళ్లి అడగగలుతున్ననామని తెలిపారు. ఎన్నికలు వచ్చినా లేకపోయినా నిరంత్రంగా ప్రజలలో ఉంటున్నామని, అశోక్ గజపతి రాజు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు… వీరభద్రస్వామి ఎప్పుడూ ప్రజలలోనే ఉంటారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని చాలా మంది విద్యావంతులుగా తయారయ్యారని గుర్తుచేశారు. అందుకే అందరూ కలిసికట్టుగా పని చేసి మన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.