TDP Leader Challenge :విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు ఫైర్.. దమ్ముటే నర్సీపట్నం రావాలని సవాల్
Narsipatnam affair: ఇటీవల నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీనిపై స్పందించిన అయ్యన్న పాత్రుడు ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డికి దమ్ముంటే నర్సీపట్నం రమ్మని నువ్వో నేనో తేల్చుకుందామని సవాల్ విసిరాడు. తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం నర్సీపట్నంలోనే ఉందని వెల్లడించారు. జేసీబీలు, ఐపీఎస్ అధికారులు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు తీసుకువచ్చారని ఆరోపించారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
తనను చూసి విజయసాయి రెడ్డి భయపడుతున్నారన్నారు. అందుకే సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులకు సైతం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు. అంతలా భయపడేవాడివైతే తాను లేని సమయంలో తన ఇంటిపై జేసీబీలతో దాడికి ఎందుకు పూనుకున్నావని ప్రశ్నించారు. చీము నెత్తురు లేని వ్యక్తి విజయసాయి రెడ్డి అని టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు.