Atchannaidu: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను గాలికొదిలేశారు.. అచ్చెన్నాయుడు
Atchannaidu: పోలవరం ప్రాజెక్ట్ ను వైసీపీ నిర్లక్ష్యం చేస్తోందని వ్యవసాయం పై వైసీపీ ప్రభుత్వానికి అవగాహనే లేదని సాగు నీటిపై ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్దితిలో ఉన్నారని టిడిపి శాసనసభాపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్ట్ ల పై చర్చకు వచ్చే దమ్ముందా అని వైసీపీకి ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయం రంగాన్ని జగన్ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ అదికారంలోకి వస్తే,సాగు నీటి ప్రాజెక్ట్ లకు సంపూర్ణ నిదులు కేటాయిస్తామని తెలిపారు.
ఈ నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందని అన్నారు. ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత టిడిపి ప్రభుత్వం రూ.1,754 కోట్లను ఖర్చు చేసి 69 వేల ఎకరాలకు నీరందిస్తే వైసిపి జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేవలం రూ.485 కోట్లను మాత్రమే ఖర్చు చేసి 1100 ఎకరాలకు మాత్రమే నీరందించిందని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం కేవలం కమీషన్‌ల కోసమే సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించిందని విమర్శించారు.