Undavalli Arun Kumar: బాబు చేయనిది, జగన్ చేసి చూపించారు!
Undavalli Arun Kumar: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ రాజమండ్రిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు విచారిస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామం అని, ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుందని అన్నారు. ప్రభుత్వం దాఖలు చేసిన అభివృద్ధి కారణంగా ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం సహా కేంద్రం నుంచి ఏపీకి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో వివరించారని, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున ఇదే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగాను, చేస్తానని చెప్పారు… కానీ చేయలేదు అయితే ఇప్పుడు జగన్ ఆ పని చేశారు. అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఇచ్చి తీరాలి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.