ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకి అనంతపురం పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆమెను విచారణకు రావలసిందిగా కోరుతూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టిపారేసింది.
ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకి అనంతపురం పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆమెను విచారణకు రావలసిందిగా కోరుతూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టిపారేసింది.
అసలేం జరిగిందంటే…
సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై వైసిపి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి అనూషను విచారణకు రావాల్సిందిగా DSP ఆదేశించారు.
అనూష తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు 41A నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ కక్షతోనే అనూషను విచారణకు పిలిపిస్తున్నారని వాదనలు వినిపించారు. పోసాని వెంకటేశ్వర్లుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, 41A నోటీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.