Jana Sena: జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఆహ్వానించిన అధినేత పవన్ కళ్యాణ్
Two Ex MLAs in Andhra Join in Jana Sena party
జనసేన పార్టీలో రాను రాను జోష్ పెరుగుతోంది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు అనేక మంది యువకులు ముందుకు వస్తున్నారు. యువకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కూడా జనసేన వైపు ఆకర్షితులౌతున్నారు. తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేనలో చేరారు. అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఇద్దరు నేతలను జనసేనలోకి ఆహ్వానించారు.
డబ్బులతోనే పార్టీని నడపలేం – పవన్ కళ్యాణ్
తాను డబ్బుబలాన్ని నమ్మడంలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనవంతు తాను కృషి చేస్తానన్నారు. పార్టీకి ఇంకా ప్రతికూల పవనాలే ఉన్నాయన్నారు. పార్టీకి ఇంకా అనుకూలపవనాలు రాలేదని అన్నారు .ప్రతి కాపు తనకి ఓటు వేసి ఉంటే గాజువాక..భీమవరంలో గెలిచి ఉండేవాడినని పవన్ కళ్యాణ్ అన్నారు. ఓడిపోయాను కానీ వెనక్కి తగ్గలేదని పవన్ అన్నారు.
కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీలో పాల్గొన్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#JSPForKapuWelfare pic.twitter.com/9N03f5NNj2
— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 12, 2023
#JSPForKapuWelfare pic.twitter.com/ftiYuZp5pW
— Narendra Janasena🔯 (@Narendra4JSP) March 12, 2023
తెలుగుదేశంతో 20 సీట్లకు పోటీ కుదిరింది అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నేను లోపాయికారీ ఒప్పందాలు చేసుకోను. అలా మన గౌరవం తగ్గించే పొత్తులకు వెళ్ళను, ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవం తగ్గించే పని నేను చెయ్యను – @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#JSPForKapuWelfare
— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 12, 2023