తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మీ వ్రతం కావడంతో.. ఏడుకొండలవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
TTD: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మీ వ్రతం కావడంతో.. ఏడుకొండలవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఘననీయంగా పెరిగింది. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. ఇకపోతే గురువారం శ్రీవారిని 67,308 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 26,674 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ లెక్క రూ. 3.82 కోట్లుగా తేలింది.
మరోవైపు టీటీడీ అధికారులు ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్ట్ నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 25.05 లక్షలు విడుదల చేశారు. టీటీడీ సహకారంతో 501 ఆలయాల నిర్మాణం, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి రూ. 5వేలు కేటాయించారు. ఇకపై ప్రతినెలా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం నిధులు విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయించారు.