TTD : భక్తుల రద్దీ సాధారణం…ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం
TTD Temple Devotees Information: తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లో ఉంటున్నారు. కాగా, ఆదివారం రోజున స్వామివారి దర్శనం కోసం రద్ధీ సాధారణంగా ఉందని టీటీడీ తెలియజేసింది. ఆదివారం రోజున శ్రీవారిని 67,169 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 21,222 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారిక వర్గాలు ప్రకటించాయి.
ఇక, హుండీ ద్వారా రూ. 3.86 కోట్ల ఆదాయం లభించింది. టైమ్‌స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. టోకెన్లు లేని వారు నేరుగా క్యూలైన్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇక, పండుగ రోజులు కావడంతో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఈ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 13 నుండి జనవరి 31 వరకు గల కోటాను విడుదల చేయనున్నారు.