Tirumala: జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. టిటిడి
Tirumala: నూతన సంవత్సరంలో శ్రీవారి సేవలకు టికెట్లు సిద్దం చేస్తున్నారు. జనవరి మాసంలో శ్రీవారి ఆర్జత సేవా టికెట్ల విడుదలకు ముహూర్తం టీటీడీ ప్రకటించింది. జనవరి మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు మధ్నాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల తిరుమతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. మరి కొన్ని ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియను అదే రోజు నిర్వహించనున్నారు.
కొత్త సంవత్సరంలో శ్రీవారి దర్శనం కోసం ప్రతీ ఏటా రద్దీ ఎక్కువగా ఉంటుంది. 2023 జనవరి 1న ప్రోటోకాల్ దర్శనాల్లో నేరుగా వీఐపీలు వస్తే వారికి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా జనవరి 2వ తేదీ నుంచి తిరుమలలో ముక్కోటి ఉత్సవాల నిర్వహణకు సిద్దమైంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. అదే విధంగా.. ఆన్‌లైన్ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. గతంలో రోజుకు 20 వేల మందికి టికెట్లు జారీ చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను రోజుకు 25వేలకు పెంచారు.