TTD on Srivani Darshan Tickets: టీటీడీ కీలక నిర్ణయం… శ్రీవాణి దర్శన టికెట్లు కుదింపు
TTD on Srivani Darshan Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తుల కోసం ప్రత్యేకంగా శ్రీవాణి దర్శన టిక్కెట్లను పంపిణీ చేస్తుంది. అయితే, శ్రీవాణి దర్శన టిక్కెట్లను ఇకనుండి కేవలం 1000 మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా 750 టిక్కెట్లను ఇవ్వాలని, మిగిలిన 250 టిక్కెట్లను ఆఫ్‌లైన్ ద్వారా అందివ్వాలని నిర్ణయించింది. జనవరి 11 వ తేదీన 250 టిక్కెట్లను విడుదల చేయనున్నది. అయితే, ఇప్పటి వరకు మాధవరం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టిక్కెట్ల కోసం కౌంటర్ ఉండేది. కాగా, ఇప్పుడు ఆ కౌంటర్‌ను మూసేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
నేటితో ఉత్తరద్వార దర్శనం పూర్తికానుండటంతో తిరిగి తిరుప్పావడ సేవలను పునరుద్దరించనున్నారు. పండుగ రోజులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సర్వదర్శనం టిక్కెట్లు లేకున్నా నేరుగా క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. వరసగా సెలవులు ఉండటంతో స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్నారు.