శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి సమీపంలోని బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ బాతువ వద్దకు రాగానే సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగి పక్క ట్రాక్‌పైకి వెళ్లారు. ప్రయాణికులు వెళ్లిన ట్రాక్ నుంచి అనుకోకుండా, ఎలాంటి హరన్ ఇవ్వకుండా భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వేగంగా రావడంతో ఆట్రాక్‌పై నిలబడ్డ ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రాయాణికులు గాయపడ్డారు.
ప్రమాద విషయం తెలియడంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అప్రమత్తమైయ్యారు. స్థానిక ఆర్డివో, ఎమ్మార్వోను ప్రమాద సమయానికి వెళ్లాల్సింది అదేశించారు. క్షతగాత్రులకు మైరుగైన వైద్యం అందించాల్సిందిగా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృత దేహాలు పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు అస్సాంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.