రామ్, లక్ష్మణ్ లు ఫైట్ మాస్టర్స్ (Ram-Lakshman Masters) గా టాలీవుడ్ (Tollywood) జనాలకు సుపరిచితులే. ఇప్పటికి వెయ్యికి పైగా సినిమాలకు వీరు స్టంట్స్ సమకూర్చారు. ఎంతో కష్టపడి సినీ రంగంలో అగ్ర ఫైట్ మాస్టర్స్ గా నిలదొక్కుకున్నారు.
Ram-Lakshman Masters: రామ్, లక్ష్మణ్ లు ఫైట్ మాస్టర్స్ (Ram-Lakshman Masters) గా టాలీవుడ్ (Tollywood) జనాలకు సుపరిచితులే. ఇప్పటికి వెయ్యికి పైగా సినిమాలకు వీరు స్టంట్స్ సమకూర్చారు. ఎంతో కష్టపడి సినీ రంగంలో అగ్ర ఫైట్ మాస్టర్స్ గా నిలదొక్కుకున్నారు. ఫైట్ మాస్టర్స్(Fight Masters) గా కాకుండా.. వీరిలో మరో యాంగిల్ కూడా ఉందనే విషయం కొంతమందికే తెలుసు. సామాజిక సేవా (Social Service) కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం.. నలుగురికీ మంచి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడం రామ్ – లక్ష్మణ్ ల స్పెషాలిటీ. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ఎన్నో మంచి పనులకు ఉడత భక్తిగా చేయూతనందిస్తుంటారు.
తాజాగా రామ్, లక్ష్మణ్ లు ఓ మంచి పనికోసం జోలె పట్టారు. ఫైట్ మాస్టార్లమని మరచిపోయి కనిపించిన వారందరిని ఆర్థికసాయం చేయమని కోరారు. వీరు చేసిన పనికి అక్కడున్న వారందరు విస్తుపోయి చూసారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల (Bapatla) జిల్లా చీరాలలోని దండుబాటలో ఉన్న కోటయ్య వృద్ధాశ్రమాన్ని (Old Age Home) సందర్శించారు రామ్, లక్ష్మణ్ లు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఆశ్రమానికి వాహనం లేదన్న విషయాన్ని తెలుసుకున్న రామ్-లక్ష్మణ్‌లు వాహనం కొనుగోలుకు అవసరమైన డబ్బుల కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జోలెపట్టి భిక్షాటన చేశారు.
పట్టణం లోని బెస్తపాలెం, కూరగాయల మార్కెట్ కూడళ్లలో భిక్షాటన చేశారు. దానికి వారు కొంత వేసుకుని మొత్తం రూ. 43,789 ఆశ్రమానికి (Old Age Home) ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనచుట్టూ ఎంతోమంది పేదలు, వృద్ధులు ఉన్నారని వారికి సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతం లో కూడా అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరించిన విషయం తెలిసిందే. నిరుపేదలకు సాయం చేసేందుకు ఏదైనా చేయాలనే ఆలోచన ముందునుంచీ ఉందని ఇప్పుడు అందులోనే మానసిక తృప్తిని వెతుక్కుంటున్నట్లు తెలిపారు. వీలైనన్ని నిధులు సేకరించి వచ్చే సొమ్ముతో పది మందికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తామని అంటున్నారు.