భారీగా పెరగనున్న టోల్ ప్లాజా రేట్లు… ఏ వాహనానికి ఎంతంటే
ఏపీలో టోల్ రేట్లు పెంచింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. కొత్త రేట్ల ప్రకారం కిలో మీటర్లను బట్టి, వాహనాలను బట్టి ఛార్జీలు ఉంటాయని తెలిపింది. కారుకు 5 రూపాయల నుంచి 10కి పెంచింది. దీంతో పాటు బస్సు, లారీలకు 15 నుంచి 25కి పెంచింది. భారీ వాహనాలకు 40 రూపాయల నుంచి 50కి పెంచింది ఎన్‌హెచ్‌ఏఐ.
మరోవైపు ఏపీ వ్యాప్తంగా 56 టోల్ ప్లాజాలు ఉండగా.. పెంచిన రేట్లతో రోజుకు 6.6 కోట్ల మేర వసుళ్లు చేయనుంది ఎన్‌హెచ్‌ఏఐ. ఈ లెక్కన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏడాదికి 2 వేల 409 కోట్లను వసూళ్లు చేయనుంది. ప్రస్తుతం ఏపీలో టోల్ రేట్లు పెంచిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. రానున్న రోజుల్లో రాష్ట్రాల వారీగా క్రమంగా దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజా ఛార్జీలను పెంచబోతున్నట్లు తెలుస్తుంది.